World Cup 2023:పసికూనలే.. కానీ జాగ్రత్త!

36
- Advertisement -

వరల్డ్ కప్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ అంచనాలు లేకుండా మెగా టోర్నీలో అడుగుపెట్టిన చిన్న జట్లు.. వరల్డ్ చాంపియన్ జట్లకు తెలుకోలేని షాక్ ఇస్తున్నాయి. తమను తక్కువగా అంచనా వేస్తే ముప్పే అని గట్టిగా హెచ్చరిస్తున్నాయి. మొన్న జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ జట్టు సౌతాఫ్రికా ను ఎవరు ఊహించని రీతిలో మట్టికరిపించి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయం మరవక ముందే పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ విజయం సాధించి మరో సంచలనానికి తెర తీసింది. నిన్న పాకిస్తాన్ మరియు అఫ్గానిస్తాన్ మద్య జరిగిన కీలక మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది..

చేదించాల్సిన లక్ష్యం పెద్దగా ఉండడంతో పాక్ జట్టు గెలవడం ఖాయం అని భావించారంతా. దానికి తోడు పాక్ బౌలింగ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలింగ్ దళం పాక్ సొంతం మరి అలాంటి జట్టు బౌలింగ్ ను ఎదుర్కొని అఫ్గానిస్తాన్ విజయం సాధిస్తుందని ఎవరు కలలో కూడా ఊహించిఉండరు. కానీ అంచనాలన్నీ తారుమారయ్యాయి. పాక్ బౌలర్స్ ను తుత్తునియాలు చేస్తూ ఆఫ్గాన్ బ్యాట్స్ మెన్స్ చేసిన విధ్వంసం చూస్తే క్రీడా విశ్లేషకులు సైతం నోరెళ్ళబెట్టాల్సిందే.

శాయిన్ అఫ్రిది, హాసన్ అలీ, ఉమర్ మిల్.. ఇలా బౌలర్ ఎవరైనా అఫ్గాన్ బ్యాటర్స్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అఫ్గానిస్తాన్ బ్యాట్స్ మెన్స్ లో గుర్బాజ్ ( 65 ), జోడ్రాన్ ( 87 ), షా( 77 ), చెలరేగడంతో రెండు వికెట్లు కోల్పోయి, 49 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. దీంతో పాయింట్ల పట్టికలో పాక్ తో సమానంగా అయిదు మ్యాచ్ లకు గాను రెండు విజయాలు నమోదు చేసి ఆరో స్థానంలో ఉంది అఫ్గానిస్తాన్ జట్టు. మొత్తానికి ఈ మ్యాచ్ తో పసికూనలే కదా అని తేలిగ్గా సీటుకుంటే భారీ మూల్యం తప్పదని పెద్ద జట్లకు స్పష్టంగా అర్థమైందనే చెప్పాలి.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

- Advertisement -