మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శరత్ మండవ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రాజీషా విజయన్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉన్నప్పటికీ, ఈ చిత్రంపై ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్లుగానే చిత్రయూనిట్ కూడా ఎగ్రెసివ్ ప్రొమోషన్స్, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకులు అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఖరారైన మాస్ టైటిల్ ‘రామారావు ఆన్ డ్యూటీ’, ఈ సినిమా ఫస్ట్‌లుక్ రవితేజ అభిమానులతో పాటుగా సినిమా లవర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.అంతేకాదు..టైటిల్‌కు, ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు సూపర్భ్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం చిత్రయూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం నుంచి మరో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ బయటకు వచ్చింది. తన ఎనర్జీ, కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో నటుడిగా మంచి ఆదరణ, గుర్తింపు తెచ్చుకున్న తొట్టెంపూడి వేణు ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కథలో ఉన్న ఇంటెన్స్, ఆసక్తికరమైన అంశాలు ఆయన్ను ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకునేలా చేశాయని తెలుస్తోంది. ఇప్పటివరకు వెండితెరపై తాను చేయని సరికొత్త క్యారెక్టర్‌ను ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో చేస్తున్నారు వేణు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, ఆర్‌టీ టీమ్ వర్క్స్ పతాకాలపై శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఓ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ సినిమాకు ప్రముఖ నటీనటులు, అత్యన్నతమైన సాంకేతిక నిపుణులు అసోసియేటైయ్యారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. కేఎల్ ప్రవీణ్ ఎడిటర్.
తారాగణంః
రవితేజ, దివ్యాంశ కౌశిక్, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, ఈ రోజుల్లో శ్రీ, మధుసూధన్ రావు, సురేఖ వాణి
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి, ఆర్‌టి టీమ్ వర్క్స్
సంగీతం: స్యామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
ఎడిటర్: కేఎల్ ప్రవీణ్
ఆర్ట్: సాయి సురేష్
పిఆర్ఓ: వంశీ- శేఖర్