‘శ్రీలీల’కు ఆ యోగం ఉందట

45
- Advertisement -

జ్యోతిష్యుడు వేణుస్వామి తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలీల జాతకం చెప్పాడు. ఈ బ్యూటీ జాతకంలో రాజయోగం ఉందన్నాడు. భవిష్యత్‌లో ఆమె కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, 2028 వరకూ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలుస్తుందన్నారు. అలాగే నయనతార జాతకానికి శ్రీలీల జాతకానికి దగ్గర పోలికలున్నాయని వేణుస్వామి పేర్కొన్నాడు. శ్రీలీల గురించి ఈ సోషల్ మీడియా జ్యోతిష్యుడు మొత్తానికి అదిరిపోయే కామెంట్స్ చేశాడు. వాస్తవానికి జ్యోతిష్యుడు శ్రీలీల గురించి ఏమీ చెప్పకపోయినా.. ఆమెకు క్రేజీ ఆఫర్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా ప్రమోట్ అయినప్పుడే.. ఆమె జాతకం ఓ వెలుగు వెలుగుతుందని అందరికీ అర్థం అయిపోయింది.

పైగా శ్రీలీల చేతిలో 8 పెద్ద సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. దీనికితోడు ఆమె టాప్ హీరోలతో ప్రస్తుతం నటిస్తోంది. శ్రీలీల జాతకం వేణు స్వామి చెప్పకపోయినా ఆమె జాతకం చాలా బాగుంది. అటు తమిళనాడులో కూడా హీరోయిన్ శ్రీలీల గురించి తెలియని వాళ్లంటూ ఉండరు. ప్రస్తుతం కోలీవుడ్ అగ్రహీరోలతోనూ నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇప్పటికే తమిళ టాప్ హీరో విజయ్ తో కూడా శ్రీలీల నటించబోతుంది. కాబట్టి.. రానున్న రోజుల్లో శ్రీలీల నెంబర్ వన్ హీరోయిన్ గా చలామణి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పిన తమన్నా

అన్నట్టు శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త వైరలవుతుంది. ఆమెను ఎవ్వరు తిట్టినా, చివరకు చెప్పుతో కొట్టినా, అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా.. శ్రీలీల చాలా సైలెంట్‌గా ఉంటుందట. అదే విధంగా ఆమెను బలవంతంగా కిస్ చేసినా కూడా సీరియస్ కాదు అట. కానీ, శ్రీలీల ను పొట్టి పిల్ల అంటే మాత్రం.. ఇక ఆమెకు కొపం ఓ రేంజ్‌లో వచ్చేస్తుందట. ఈ విషయం ఇండస్ట్రీలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఏది ఏమైనా ప్రస్తుతం శ్రీలీల టైమ్ నడుస్తోంది. ఇక లెహెంగాలో సెక్సీగా కనిపిస్తూ కవ్వించడంలో శ్రీలీల తర్వాతే ఎవరైనా.

Also Read:పెళ్లి ప్రచారంపై తరుణ్ క్లారిటీ

- Advertisement -