SSMB28లో వేణు?

84
venu
- Advertisement -

ప్రేమకథా , కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ వేణు తొట్టెంపూడి. ఇటీవలె రవితేజ రామారావు ఆన్ డ్యూటీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో మెప్పించారు. ఈ నేపథ్యంలో మరో క్రేజీ ఆఫర్‌ వచ్చింది వేణుకి.

త్రివిక్రమ్ – మహేశ్‌ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ కెరీర్‌లో ఇది 28వ సినిమా కాగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వేణుకి త్రివిక్రమ్ కీలక పాత్రను ఆఫర్ చేశారట. దీనికి వెంటనే వేణు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

అతడు , ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ మూడో చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -