సంక్రాంతి బరిలో నలుగురు కాదు ఇద్దరే..

107
Venky,Nag Stays Away From Chiru And NBK

టాలీవుడ్‌లో మరో సంక్రాంతికి హీరోలు సిద్ధమవుతున్నారు. ఎన్నడు లేనంతగా ఈసారి సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే చాలాకాలం గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150గా వస్తుంటే…నందమూరి బాలకృష్ణ హిస్టారికల్ మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణితో అభిమానులను అలరించడానికి వస్తున్నాడు. దీంతో ఈ సారి బాక్సాఫీసు పోరులో ఎవరిది పై చేయి అవుతుందోనని టాలీవుడ్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

వీరికి పోటీగా నాగార్జున, వెంకటేష్ సైతం సంక్రాంతి బరిలో దిగుతారని ప్రచారం జరిగినా….అనూహ్య కారణాలతో వీరు పోటీ నుంచి తప్పుకున్నారు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘ఓం నమో వేంకటేశాయ’, వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన ‘గురు’ సినిమాలు ఇప్పటికే చిత్రీకరణని పూర్తి చేసుకొన్నాయి. విడుదల మాత్రం సంక్రాంతి తర్వాతే. నాగార్జున తీరిగ్గా తన సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించారు. సుధ కొంగర దర్శకత్వంలో వెంకీ కథానాయకుడిగా నటించిన ‘గురు’ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొంటున్నాయి.

Venky,Nag Stays Away From Chiru And NBK

దీంతో సంక్రాంతికి నలుగురు అగ్రహీరోల మధ్య పోటీ ఉందనుకున్నారు అంతా..కానీ వీరిద్దరు తప్పుకోవటంతో పోటీ కాస్త చిరు వర్సెస్ బాలయ్యగా మారింది. అయితే, వీరికి పోటీగా గతేడాది ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’తో సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు శర్వానంద్‌ రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న శర్వానంత్ శతమానంభవతి అంటు అగ్రహీరోలకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Venky,Nag Stays Away From Chiru And NBK

ఇక ఇప్పటికే చిరు ఖైది నెంబర్ 150…బాలకృష్ణ శాతకర్ణి షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇటీవ‌లే యూర‌ప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. నిన్న‌టి(గురువారం)తో టాకీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రామోజీ ఫిలింసిటీలో బ్యాలెన్స్ సాంగ్‌ను నేటి నుంచి చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట చిత్ర‌ణ‌తో మొత్తం షూటింగ్ పూర్త‌యిన‌ట్టే.

ఈసారి సంక్రాంతి బరిలో చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’, బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మాత్రమే నిలవబోతుండటంతో ఈ సారీ పోటీలో గెలిచేదెవరనే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పటివరకు పలుమార్లు వీరిద్దరు సంక్రాంతి బరిలో తలపడగా బాలయ్యదే పైచేయి అయింది. దీంతో ఈ సారి బాలయ్యను చిరు బీట్ చేస్తాడని అభిమానులు గంపెడాశతో ఉన్నారు. న్నాయి. వెంకటేష్‌, నాగార్జున చిత్రాలు సంక్రాంతి తర్వాతే విడుదల కాబోతున్నాయి.

Venky,Nag Stays Away From Chiru And NBK