సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో వెంకట్రామిరెడ్డి చేరబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత విధేయుడిగా ఆయనకు పేరుంది.
సోమవారం వెంకట్రామి రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అణువణువు అర్ధం చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్.. ఏదైనా ఒక ప్రోగ్రాం, ప్రాజెక్ట్ చేపట్టాలంటే వారి అపార అనుభవంతో తెలంగాణ అభివృద్ధి చేశారని కొనియాడారు. సిద్దిపేటలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనేది సీఎం కేసీఆర్ విజన్‌తో మేము నడుచుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు రాగానే పార్టీలో చేరుతాను. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేటను అభివృద్ధిలో దేశంలో రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాను అన్నారు.
ఎన్నో కొత్త ప్రాజెక్ట్ లకు సిద్దిపేట జిల్లా వేదిక అయింది. సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో జరిగుతున్న అభివృద్ధి చూసాను.. తెలంగాణ అంతకంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. అందులో నేను భాగస్వామ్యున్ని కావడం ఆనందంగా ఉంది. భూసేకరణ విషయంలో 9వేల కుటుంబాలకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసాం..ముంపు గ్రామాల వాసులు ఖాళీ చేసే సమయంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చేసామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ జిల్లాలో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాము.
నా 26 సంవత్సరాల సర్వీస్‌లో ఈ 7 సంవత్సరాలు నాకు సంతృప్తిని ఇచ్చింది. ఈ 7 సంవత్సరాలు అనేక కార్యక్రమాలలో నన్ను సీఎం కేసీఆర్ భాగస్వామ్యం చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అనేక కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఏ పదవి ఇచ్చిన నా వంతు కృషి చేస్తాను అని మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.