సూర్య-వెంకీ మల్టీస్టారర్..?

294
Venkatesh
- Advertisement -

టాలీవుడ్‌లో మల్టిస్టారర్ల ట్రెండ్‌ మొదలైంది. ఇప్పటికే పలు మల్టిస్టారర్లు సెట్స్ పై ఉండగా మరి కొన్ని మల్టిస్టారర్లు ప్లానింగ్ దశలో ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ మల్టిస్టారర్‌కు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఒక వైపున సోలో హీరోగా చేస్తూనే మరో వైపున మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు హీరో వెంకటేష్. అలా ప్రస్తుతం ఆయన నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామా’ .. వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా వెంకటేష్ మరో మల్టీస్టారర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Venkatesh

ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో ప్లాన్ చేశారట. ఈ సినిమాలో ఒక కథానాయకుడిగా వెంకటేశ్ మరో కథానాయకుడిగా సూర్య చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. గతంలో పోలీస్ పాత్రల్లో ఇటు వెంకీ .. అటు సూర్య తమ సత్తా చాటుకున్నారు. ఈ సినిమాలో చేయడానికి సూర్య ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు వున్నట్టుగా సిని వర్గాల సమాచారం.

- Advertisement -