ఆయనే నిజమైన నాయకుడు: కేటీఆర్‌

186
vajpeyee

నాయకుడన్న పదానికి నిజమైన అర్థం అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అని వ్యాఖ్యానించారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఈ రోజు 05.05 గంటలకుకన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే వాజ్‌పేయి మృతి చెందినట్లు తెలుసుకున్న కేటీఆర్ ..ట్విట్టర్‌ ద్వార స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వాజ్‌పేయి భావితరాలకు ఎంతో ఆదర్శమని అన్నారు. అంతేకాకుండా ‘‘నాయకుడు అన్న పదానికి నిజమైన అర్థం. అత్యద్భుతమైన వ్యాఖ్యాత. పార్టీలోని ప్రతి ఒక్కరు ఆరాధించే మనిషి. గొప్ప రాజకీయవేత్త నేడు కన్ను మూశారు. అటల్ బిహారీ వాజ్‌పేయిజీని భావితరాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుని.. మన దేశాన్ని ఇంకా బలోపేతం చేయాలి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.