‘భీమ్లానాయక్’పై వెంకటేష్ ఆసక్తికర కామెంట్స్‌..!

115
- Advertisement -

టాలీవుడ్‌ పవన్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా విక్టరీ వెంకటేష్ ‘భీమ్లానాయక్’పై స్పందించారు. ‘భీమ్లానాయక్’ మ్యాగ్నిఫిసెన్స్… డేనియల్ శేఖర్ మెరుపుదాడి సక్సెస్‌ను టేకోవర్ చేసుకుంది. రానా నటన అద్భుతం. ‘భీమ్లానాయక్’ ఘనవిజయం సాధించిన సందర్భంగా టీమ్ అందరికి శుభాకాంక్షలు అని వెంకీ ట్వీట్ చేశారు.

అలాగే హీరో నితిన్ పెట్టిన పోస్ట్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.’ఇది కదా మాకు కావాల్సింది.. రానా దగ్గుబాటి ఇరగ్గొట్టావ్’ అంటూ పవన్ స్కెచ్ ని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోని నితిన్ షేర్ చేశాడు. కాగా సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించగా.. నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. పవన్ నుంచి చాలా రోజుల తరువాత మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -