ఆ కోరికను బయటపెట్టేశాడు..

113

‘గురు’ సినిమాతో డీసెంట్‌ హిట్‌ను కొట్టాడు విక్టరీ వెంకటేష్‌. ఇక తన తదుపరి సినమాల గురించి మాత్రం ఇన్ని రోజులు సస్పెన్స్‌లోనే పెట్టాడు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో నటించాలనుకున్నప్పటికీ, అది కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఆ తరువాత పూరీ, క్రిష్‌ దర్శకత్వాలలో వెంకీ నటించబోతున్నట్లు వార్తలు వచ్చినా అవి కూడా డీలా పడిపోయాయి.
 Venkatesh and Salman together
అయితే తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ గురించి రీసెంట్‌గా చెప్పుకొచ్చిన వెంకీ.. ప్రస్తుతానికి ఎలాంటి కమిట్‌మెంట్స్‌ లేవని చెప్తున్నాడు.  కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

అయితే బాలీవుడ్‌లో సల్మాన్‌ తనకు మంచి ఫ్రెండ్‌ అని అతడితో కలిసి ఓ సినిమా చేయాలనుందని అసలు కోరికను బయటపెట్టాడు వెంకటేష్‌. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ కోసం ఎలాంటి వర్క్ జరగకపోయినా అవకాశం ఉంటే మాత్రం సల్మాన్‌తో నటించేందుకు తాను సిద్ధమని తెలిపాడు. మరి సల్మాన్‌తో నటించాలనే వెంకీ కోరిక తీరిడానికి ఇంకెన్ని రోజులుపడుతుందో చూడాలి.