సమంత మూగబోయింది…

183
Samantha Starts shooting for Ramcharan-Sukumar
- Advertisement -

సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది . మరి సమంత పెళ్లి తర్వత సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందని సిని వర్గాల్లో గుస గుసలు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే సమంత పెళ్లి తర్వాత కూడా నటిస్తుందని చైతూ క్లారిటీ ఇవ్వడంతో.. ఆ వెంటనే ఒకేసారి రెండు తమిళ్ మూవీస్, తెలుగులో చరణ్ మూవీ, రాజు గారి గది-2, మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది.మరి రామ్‌ చరణ్‌ మూవీలో సమంత కీలక పాత్ర చేయబోతుంది.ఆ పాత్ర గురించి తాజాగా ఒ వార్త బయటికి వచ్చింది

Samantha Starts shooting for Ramcharan-Sukumar

చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ .. సమంతాల మధ్య ఒక పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ కాస్త చెవుడు వున్న యువకుడిగా కనిపిస్తాడనే వార్త కొన్ని రోజుల క్రితమే బయటికివచ్చింది. దాంతో మరి సమంతా పాత్ర ఎలా వుండనుందోననే ఆసక్తి అభిమానుల్లో తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సమంతా మూగతనం కలిగిన అమ్మాయిలా కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను కూడా ఆల్రెడీ చిత్రీకరించారని అంటున్నారు.

- Advertisement -