రేస్‌లోకి వెంకటేష్ ప్రసాద్.. మరింత రసవత్తరం

521
- Advertisement -

టీమ్‌ఇండియా కోచ్‌ పదవికి రేసులో మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఉన్నట్టు సమాచారం. ఇంతకుముందు దరఖాస్తులను ఆహ్వనించినప్పుడు వెంకటేష్‌ ప్రసాద్, రవిశాస్త్రిలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ మరోమారు దరఖాస్తులు ఆహ్వానించి జులై 9 గడువు తేదీగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రసాద్‌ జూనియర్‌ నేషనల్‌ చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరులో తన పదవి కాలం పూర్తి కానుండటంతో ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు పంపారట.

7bfbbfbeaf7d663878d521c87465-grande

నిజానికి రవిశాస్త్రి కొన్ని రోజుల కింది వరకు ఇందుకు సుముఖంగా లేడు. ఐతే సచిన్‌ టెండూల్కర్‌ రవిశాస్త్రితో మాట్లాడి అతణ్ని కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఒప్పించినట్లు సమాచారం. కోచ్‌ పదవి కోసం మళ్లీ తాను ఇంటర్వ్యూకు హాజరు కాలేనని, బాధ్యతలు ఇస్తే స్వీకరిస్తానని స్పష్టంగా చెప్పాడు. అయితే రవిశాస్త్రి ప్రకటనపై ట్విటర్‌లో అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

shaz

రవిశాస్త్రి, ప్రసాద్‌ ఇద్దరికీ టీమిండియా డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉంది. 2007 నుంచి 2009 వరకు టీమిండియాకి బౌలింగ్‌ కోచ్‌గా పని చేసిన ప్రసాద్‌ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకి బౌలింగ్‌ కోచ్‌గా సేవలు అందించాడు. భారత్‌ తరఫున ఆయన 33 టెస్టులు, 161 వన్డేలు ఆడారు.

bcci-m

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రవిశాస్త్రి వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కోచ్‌ను ఎంపిక చేసే క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)లో గంగూలీ, లక్ష్మణ్‌తో పాటు సచిన్‌ సభ్యుడన్న సంగతి తెలిసిందే. ఇదే కమిటీ ఇంతకుముందు రవిశాస్త్రిని కాదని కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేసింది. అప్పుడు కూడా సచిన్‌.. శాస్త్రికే మద్దతు తెలపగా.. గంగూలీ. కుంబ్లేవైపు మొగ్గుచూపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఏసీ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం. గంగూలీ, రవిశాస్త్రి మధ్య సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే. ఇప్పటికే కోచ్‌ రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్‌, టామ్‌మూడీ, దొడ్డ గణేశ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఉన్నారు. తాజాగా వెంకటేశ్‌ ప్రసాద్‌ కూడా రేసులోకి రావడంతో కోచ్‌ ఎంపిక ఆసక్తికరంగా సాగనుండటం ఖాయంగా కన్పిస్తోంది.

- Advertisement -