‘వెంకీమామ’ ట్రైలర్..

450
venky-mam
- Advertisement -

విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య లు ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్‌ చిత్రం వెంకీమామ. ప్రముఖ దర్శకుడు బాబీ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించారు. సురేష్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఖమ్మంలో ఈచిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. డిసెంబర్ 13న ఈమూవీని విడుదల చేయనున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈచిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు వెంకటేశ్, నాగచైతన్య. దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈచిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో వెంకీ, చైతూ ఇద్దరు రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో దర్శనమిస్తున్నారు. వెంకటేష్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నా నటిస్తోంది.

- Advertisement -