‘సవ్యసాచి’ నుండి రొమాంటిక్‌ వీడియో సాంగ్‌..

244
Savyasachi
- Advertisement -

నాగ చైత‌న్య‌, చందూ మొండేటి కాంబినేష‌న్‌లో ప్రేమమ్ లాంటి సెన్సిబుల్ లవ్ ఎంటర్ టైనర్ అనంతరం తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సవ్యసాచి”. ఈ చిత్రాన్ని నవంబర్ 2న విడుదల చేయనున్నారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తుండడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. “సవ్యసాచి” షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్‌ కూడా ప్రారంభించారు.

Savyasachi

ఇక శనివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జ‌రిగింది. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రాని ఓ సరికొత్త కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందించారు. ఆయ‌న స్వ‌ర‌ప‌ర‌చిన బాణీల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా మూవీ నుండి వై నాట్ అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియో అభిమానుల‌ని అల‌రిస్తుంది.

చిత్రంలో వెన్నెల కిషోర్‌, సత్య, రావు రమేష్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. ఈ చిత్రంలో చైతూ త‌న రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ని, ప్ర‌త్య‌ర్ధుల‌ని ఎదుర్కొంటాడు అని చూపించ‌నున్నారు.

- Advertisement -