షూటింగ్‌లో గాయపడ్డ వెంకీ..రిలీజ్‌కు బ్రేక్..!

705
venky mama
- Advertisement -

విక్టరీ వెంకటేశ్‌-నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ వెంకీమామ. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా రామోజీ ఫిలిం సిటీలో వెంకటేష్,పాయల్ రాజ్ పుత్ ల మధ్య ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ సమయంలో వెంకటేష్ గాయపడ్డారు. కాలు బెణకడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించగా కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 4 న విడుదల కావాలి. వెంకటేష్ కాలి గాయంతో సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

- Advertisement -