న్యూయార్క్.. టైమ్ స్క్వేర్‌లో కాళేశ్వరం

579
kaleshwaram times square

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్మించిన లక్ష్మీపూర్ భూగర్భ  పంప్‌హౌజ్‌, ప్రాజెక్టు విశిష్టతను ప్రపంచవ్యాప్తం చేసేలా  ప్రసారం చేశారు.

మూడు రోజుల పాటు రోజుకు ఐదుసార్లు న్యూయార్క్‌ కూడలిలోని అతిపెద్ద తెర మీద వీక్షకులకు కనువిందు చేసింది. కాళేశ్వరం ప్యాకేజీ–8లో భాగంగా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ వద్ద నిర్మించిన ఈ పంప్‌హౌజ్‌ ప్రపంచంలోనే అతి పొడవైన భూగర్భ పంపుహౌజ్‌గా ప్రసిద్ధి పొందింది. ఈ పంప్‌హౌజ్‌లో మొత్తం ఏడు మోటార్లు ఉన్నాయి.

భూగర్భంలో దాదాపుగా 140 మీటర్ల లోతులో ఉన్న నీటి పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు,హైదరాబాద్‌కు తాగు నీరు అందనుంది.