తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రముఖులు తరలివచ్చారు. శనివారం పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్, తెలంగాణ ఎంపీ ఈటల రాజేందర్ శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
అదేవిధంగా కర్ణాటక మంత్రి కె.హెచ్. మునియప్ప స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినీ నటుడు అజయ్ రత్నం కూడా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ ఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ సైతం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
తెలంగాణ బీజేపీ నేత, సినీ నిర్మాత గుడూరు నారాయణ రెడ్డి కూడా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖుల రాకతో తిరుమలలో సందడి నెలకొంది. దర్శనానంతరం వారంతా స్వామివారి ఆశీస్సులు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Also Read:దేశంలో పెరిగిన మత్య్స సంపద

