వెంకీ ‘దృశ్యం 2’కు ముహుర్తం ఖరారు..!

179

టాలీవుడ్‌ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘దృశ్యం 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే వెంకీ నటించిన ‘నారప్ప’ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడదలై అనూహ్యమైన హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ‘దృశ్యం 2’ సినిమాపై పడింది. ఈ సినిమా కూడా ఓటీటీలోనే రానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. హాట్ స్టార్ వారు భారీ మొత్తం చెల్లించి ఈ సినిమాను కొనుగోలు చేశారనే వార్త ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ‘వినాయక చవితి’కి విడుదల చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు.మలయాళంలో వచ్చిన ‘దృశ్యం 2’కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులోను అదే స్థాయిలో రెస్పాన్స్ రావడం ఖాయమనే అభిప్రాయంతో ఉన్నారు. విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకటేష్, మీనా జంటగా నటించారు. నదియా కీలకపాత్రలో కనిపించనుంది