వెంకీని పార్టీ అడిగిన చిరు

110
- Advertisement -

టాలీవుడ్ క్లోజ్ ఫ్రెండ్స్ లో మెగా స్టార్ చిరు -విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడు వెంకీ , వెంకటేష్ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు చిరు ఇద్దరూ కంగ్రాట్స్ చెప్పుకుంటూ మాట్లాడుకుంటారు. నారప్ప చూసి చిరు చాలా సేపు మాట్లాడారని స్వయంగా వెంకీ నే చెప్పుకున్నాడు.

ఈరోజు వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా వెంకటేష్ కి చిరు విషెస్ తెలిపాడు. ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్న ఓ ఫోటో షేర్ చేసి ” మై డియర్ వెంకీ హ్యాపీ బర్త్ డే ” అంటూ వెంకటేష్ ని విష్ చేశాడు చిరు. ఆ విషెస్ తో పాటు వేర్ ఈజ్ ద పార్టీ అంటూ వెంకీ ను పార్టీ ఇవ్వమని అడిగాడు మెగా స్టార్.

చిరు లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుండి వేర్ ఈజ్ ద పార్టీ సాంగ్ రిలీజై దుమ్ము దులుపుతోంది. ప్రెజెంట్ ఎక్కడా చూసిన ఈ సాంగే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సాంగ్ లిరిక్ తో వెంకీ ని సరదాగా పార్టీ అడిగాడు చిరు. మరి సోషల్ మీడియా ద్వారా పార్టీ అడిగిన చిరుకి వెంకీ ఏమని రిప్లై ఇస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ట్రైలర్…పాన్ ఇండియా లాఠీ

శ్రీనివాస్ అవసరాల…అవతార్‌2 కు రైటర్

అవ‌తార్‌-2 దర్శకుడికి కరోనా

- Advertisement -