మన మాతృభాషను కాపాడుకోవాలి- వెంక‌య్య నాయుడు

20
Venkaiah Naidu

ఉప రాష్ర్ట‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు అంత‌ర్జాతీయ మాతృభాష దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. భాషా వైవిధ్యం నాగ‌రిక‌త‌కు గొప్ప పునాది అని పేర్కొన్నారు. భాష కేవలం మన భావాలను ఎదుటి వారికి తెలియజేసేందుకే కాక, మన సంప్రదాయాలను, సామాజిక సంస్కృతిని తెలియజేసే గొప్ప వారధి అని ఆయన అన్నారు.

జీవితానికి ఆత్మ అమ్మభాషే. మన మాతృభాషను మనం కాపాడుకోవాలి. ప్రాథమిక విద్య మొదలు, పరిపాలన వరకూ మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన స్మృజనాత్మక ఆలోచనలు, భావ వ్యక్తీకరణను తమ తమ అమ్మ భాషల్లో ప్రోత్సహించుకోవాలి అని వెంక‌య్య నాయుడు పేర్కొన్నారు.