ఇంగ్లాండ్‌‌ టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే..

52
Team India

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్‌ సిరీస్‌ తర్వాత టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌ ఆడనుంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆడే భారత జట్టును ప్రకటించారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో 19 మందితో కూడిన జట్టును బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈసారి రాహుల్ తెవాటియా, సూర్యకుమార్ యాదవ్ లకు జాతీయ జట్టులో స్థానం కల్పించారు. అలాగే తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి,రిషబ్ పంత్‌తో పాటు మరో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు. వీరితో పాటు యార్కర్ స్పెషలిస్టు టి.నటరాజన్ కూడా జట్టుకు ఎంపికయ్యాడు.

భారత జట్టు…

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యజువేంద్ర చహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.