పీవీ సేవలు అజరామరం: వెంకయ్య నాయుడు

140
venkaiah
- Advertisement -

భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి శతజయంతి సందర్భంగా విశాఖపట్టణంలోని సర్క్యూట్ హౌజ్ జంక్షన్‌లో పీవీ విగ్రహానికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు నివాళులు అర్పించారు.

భారత మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని వెల్లడించారు.

స్వావలంబన, స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు పరచిన పీవీ, మాతృభాషకు సైతం అంతే ప్రాధాన్యతనిచ్చారు. విశాల దృష్టితో వీక్షించి, దేశానికి వారు అందించిన సేవలను జాతి యావత్తు చిరకాలం గుర్తు పెట్టుకుంటుందన్నారు.

- Advertisement -