- Advertisement -
ప్రజాస్వామ్య పునాదులను పటిష్టపరిచే దిశగా తమ ఆకాంక్షలను, ఎంపికను స్పష్టంగా తెలియజేస్తూ సుస్థిరమైన ప్రభుత్వం కోసం ఓటు వేసిన ప్రజలందరికీ అభినందనలు తెలిపారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఎన్నికలను సజావుగా, సమర్థవంతంగా, శాంతియుతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
అపారమైన ప్రజావిశ్వాసాన్ని చూరగొని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు, పార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు.ఉన్నతమైన ప్రజాస్వామ్య మూలాలను మరింత పటిష్టపరుచుకుంటూ అభివృద్ధి, సంస్కరణల ద్వారా సమిష్టి కృషితో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే దిశగా పార్టీలకు అతీతంగా అందరం కలసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.దేశ ప్రతిష్టను, మన ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవాన్ని మరింత పెంచుతారని ఆశిస్తున్నానని వెంకయ్య తెలిపారు.
- Advertisement -