తెలుగు బుల్లితెర మీద తన మాటలతో, చేతలతో తిరుగులేని యాంకర్ గా గుర్తింపుతెచ్చుకున్నది ఎవరంటే అందరు ఇట్టే చేప్పేస్తారు ఆమె పేరు సుమ అని. సుమ జనమెరిగిన మాటల పుట్ట. మాతృభాష మలయాళమైనా పదహారణాల తెలుగు నేర్చుకుని….యాంకర్లలో స్టార్ మహిళాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె వేదిక ఎక్కిందంటే చాలు.. కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరిలో ఉత్సాహం వచ్చేస్తుంది. తనదైన వాక్చాతుర్యంతో.. సెన్సాఫ్ హ్యూమర్ తో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంది సుమ.
ఏడాదిలో ఆమె తీసుకునేరెమ్యూరేషన్ కాస్త అటుఇటుగా.. ఓ స్టార్ హీరోయిన్ రెమ్యూరేషన్ తో సమానం. అంతలా వెనకేసుకుంటోంది ఈ యాంకర్. పద్దతిగా నిండైనా చిరకట్టుతో కనిపించడంలో సుమది ప్రత్యేక శైలి. అసభ్యతకు ఎంతో దూరం. ఇరవై మూడేళ్ల కెరీర్… వేల కార్యక్రమాలూ, ధారావాహికలూ… ఇలా యాంకర్ సుమ గురించి చెప్పడం మొదలు పెడితే చిట్టా చాలా పెద్దదే! ఆ ప్రస్థానంలో హాస్యాన్నీ, నటననూ కలగలిపిన యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. దీంతో సుమపై టాలీవుడ్ అగ్రహీరోల దగ్గరి నుంచి రాజకీయ నాయకులు,క్రీడాకారులు ప్రశంసలు గుప్పించిన సందర్భాలు కోకోల్లలు. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్య…..సుమక్కపై ప్రశంసలు గుప్పించారు.
తెలుగు నేల ఖ్యాతి దిగంతాలకు వ్యాపించేలా చేసిన శాతకర్ణి..ఆడియో ఫంక్షన్ తిరుపతిలో ఘనంగా జరిగింది. వేడుకకు యాంకరింగ్ చేసిన సుమ.. కట్టుబొట్టు సహా అన్ని రకాలు అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకట్టుకుంది. సుమ యాంకరింగ్ తీరుకు కేంద్ర మంత్రి వెంకయ్య ఫిదా అయిపోయారు.
తన ప్రసంగం చివరలో సుమపై ప్రశంసలు గుప్పించారు. చాలా చక్కగా మంచిగా డైలాగులు చెబుతూ ఉన్నావమ్మా. మా తెలుగు వాళ్లందరూ నిన్ను చూసి నేర్చువాల్సి ఉంది. నువ్వు కూడా ఇప్పడు మా తెలుగు అమ్మాయివే అనుకో. కానీ అందరూ నిన్ను చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఆ కట్టు.. బొట్టు.. మాట.. పాట.. ఇవన్నీ కూడా మన పద్ధతులు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఆపని నువ్వు చేస్తున్నావు. నీకు కూడా అభినందనలు’ అన్నారు. వెంకయ్య ప్రశంసలతో సుమ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
టీమిండియా క్రికెటర్ మహేంధ్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎంఎస్. ధోనీ’ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో సైతం సుమ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్‌లో ఇంగ్లిష్ లోనూ యాంకరింగ్ చేసి అదరగొట్టి….ఎంఎస్ మన్ననలు పొందిన సంగతి తెలిసిందే.