ఎంపీ అరవింద్..అబద్దాల కోరు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

477
vemula prashanth reddy
- Advertisement -

ఎంపీ అరవింద్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు.., అబద్దాలు మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని మండిపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి…అబద్దాలతో ఒకసారి సక్సెస్ అయ్యాడు, ఇక ప్రజలు అరవింద్‌ను నమ్మే పరిస్ధితిలో లేరని విమర్శించారు. కేంద్రం ఇచ్చేదానిలో రెండింతలు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇస్తుందని తెలిపారు.

రైతులు పండించే ఆహార ధాన్యం మొత్తం సీఎం కేసీఆర్ కొంటున్నారని తెలిపారు. వరి కొనుగోళ్లలో వెయ్యి కోట్ల రూపాయల భారం రాష్ట్రం మీదే పడుతుందని తెలిపారు. మక్కలను కేంద్రం కొనుగోలు చేయట్లేదు..రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు.

మోడీకి ధాన్యం కొనుగోళ్లకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదని రైతుల మీద ప్రేమంటే వరి మీద తీసుకొచ్చిన వెయ్యి కోట్ల రూపాయల వడ్డీని మోడీ నుంచి ఇప్పివ్వాలని అరవింద్‌ని డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి.

ప్రజలు, రైతులు ఎవరు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారని తెలిపారు. రైతుల మీద ప్రేమ ఉంటే పసుపు బోర్డు తీసుకుని రావాలన్నారు.

- Advertisement -