తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రస్తుత పరిస్థితిని వివరించారు ప్రశాంత్ రెడ్డి. కన్నెపల్లి పంప్ హౌస్‌లో 92 మీటర్ల వద్ద నీళ్లు ఉంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు 102 మీటర్ల వద్ద నీళ్లు ఉన్నాయి అన్నారు.
గోదావరిలో నీళ్లు లేకపోయినా, ప్రాణహిత నది కలిసే చోటు నుంచి తీవ్ర వరద ప్రవాహం ఉంది…ప్రాణహిత నది నుంచి ఏ కాలంలో అయినా నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టే కేసీఆర్ ..కాళేశ్వరం ప్రాజెక్టును ఈ విధంగా నిర్మించారు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో అసలు నీళ్లే లేవని చెప్పి రైతులను ఆగం చేయడం సరికాదు…ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి నీళ్లు లిఫ్ట్ చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందించండి అని డిమాండ్ చేశారు.
Also Read:వీడియో..రిల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం

