మత విద్వేశాలకు ఆ ముగ్గురే కారణం: ఏపీ మంత్రి

192
vellampalli
- Advertisement -

ఏపీలో జరుగుతున్న మత విద్వేశాలకు చంద్రబాబు, సోమువీర్రాజు, జీవీఎల్ ప్రధాన కారణమని చెప్పారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి… తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే మంత్రి వదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

టీడీపీ లీడర్లు కావాలనే విజయవాడలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డ వెల్లంపల్లి…బీజేపీ నేతలు ఎప్పుడు ఎం మాట్లాడుతారో వారికే తెలియదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై వారి వాదన ఎంటో చెప్పాలన్నారు.

తమ ఉనికిని చాటుకోవడానికి ప్రతిపక్షాలు రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలని చూస్తున్నాయని… మత విద్వేశాల పేరుతో రాజకీయం చేయడం సరికాదన్నారు. అంతర్వేది ఘటనలో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే మీరేం చేశారని ప్రతిపక్షాలపై విరుచుకపడ్డారు. దుర్గగుడి అభివృద్ధి కోసం సీఎం జగన్ రూ.70కోట్లు ఇచ్చారని గర్తుచేశారు.

- Advertisement -