బాలయ్య నుండి అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటారో సరిగ్గా అలాంటి పవర్ పాక్డ్ యాక్షన్ సినిమా చేశాడు గోపీచంద్ మాలినేని. సంక్రాంతి బరిలో నిలిచిన వీర సింహా రెడ్డి ట్రైలర్ రిలీజైంది. బాలయ్య పవర్ ఫుల్ డైలాగులతో అదుర్స్ అనిపిస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు. ముఖ్యంగా బాలయ్య హై వోల్టేజ్ యాక్షన్ గ్లిమ్స్ ట్రైలర్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. రామ్ లక్ష్మణ్ , వెంకట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ కానున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ముఖ్యంగా “పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికి వెళ్లయినా నిలబడు అక్కడ నీకో ఓ స్లోగన్ వినిపిస్తుంది” అనగానే అభిమానులు జై బాలయ్య అంటూ అరుస్తుండటం ట్రైలర్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే ఎలిమెంట్. అలాగే “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో , కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారాదు ,మార్చలేరు.”, “పదవి చూసుకొని మీకు పొగరేమో నాకు బై బర్త్ నా డిఎన్ఏ కే పొగరెక్కువ” అనే డైలాగ్స్ తో బాలయ్య ఏపీ ప్రభుత్వానికి ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేశాడు.
ఓవరాల్ గా ఫైట్స్ , డైలాగ్స్ , సాంగ్స్ ఇలా కమర్షియల్ సినిమాలో ఉండేవన్నీ వీరసింహా రెడ్డి లో ఉండనున్నాయనిపిస్తుంది. కాకపోతే కథ మాత్రం గతంలో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలనే గుర్తుచేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మాలినేని దర్శకుడు. జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా సినిమా థియేటర్స్ లోకి రానుంది.
ఇవి కూడా చదవండి…