‘వీర సింహా రెడ్డి’ కి సెన్సార్ పూర్తి

50
- Advertisement -

నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మాలినేని కాంబో మూవీ ‘వీర సింహా రెడ్డి’ కి సంబంధించి సెన్సార్ పూర్తయింది. సినిమాకు సెన్సార్ బోర్డ్ నుండి UA సర్టిఫికెట్ లభించింది. ఇప్పటికే ఈ సినిమాకు రెండు గంటల యాబై నిమిషాల రన్ టైమ్ లాక్ అయింది. తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు యాక్షన్ ఎపిసోడ్ ఉన్నందున ఈ మాస్ సినిమాకు UA ఇచ్చారు.

అయితే సెన్సార్ నుండి వీర సింహా రెడ్డి కి మంచి రిపార్ట్స్ ఉన్నాయి. సినిమాలో ఎమోషనల్ సీన్స్ చూసి సెన్సార్ సభ్యులు టీంను అభినందించారని తెలుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారట. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12 న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ నుండి రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి…

ప్చ్.. ఆ ప్లాప్ భామకు 2 కోట్లా ?

గీతా ఫిల్మ్ .. ‘రైటర్ పద్మభూషణ్’

కళ్యాణ్ రామ్‌…అమిగోస్‌ అద్భుతం

- Advertisement -