వీరసింహారెడ్డిని దక్కించుకున్న ఓటీటీ..

67
- Advertisement -

సంక్రాంతి బరిలో నిలిచిన వీరసింహారెడ్డి సినిమా మంచి హిట్ టాక్‌తో షోలు ఆరంభించింది. దీంతో బాలకృష్ణ నుంచి వచ్చిన మరో మాస్ సినిమాగా తన ఖాతాలో నిలిచిపోయింది. ఫ్యాన్స్‌ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌ టచ్‌ చేస్తూ సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సంక్రాంతికి బరిలో నిలిచింది. మలినేని గోపిచంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ నటించింది.

దునియా విజయ్‌, హనీ రోజ్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, పీ రవిశంకర్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలో నటించారు. అయితే థియేటర్‌లోకి వచ్చి వారం కాకముందే దీన్ని ఓ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫాం సంస్థ కొనుగోలు చేసినట్టు టాలీవుడ్‌లో టాక్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సంస్థ వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్‌ దక్కించుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశంతో తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు థమన్‌ సంగీత బాణీలు సమకూర్చారు. చంద్రికరవి స్పెషల్‌ సాంగ్‌తో ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి…

మెగా ముచ్చట్లు.. కాస్త స్పైసీగా !

అజిత్ పై విజయ్ గెలుపు ?

బాలయ్య ఓ రోజంతా తినలేదు!

- Advertisement -