వీరమల్లు..మూడో సాంగ్ అదుర్స్!

7
- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు‌‌.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన మూడో సాంగ్ అందరిని ఆకట్టుకుంటోంది. అనుకున్నట్టుగానే పవర్ ఫుల్లుగా ఉండగా కీరవాణి ఇచ్చిన ట్యూన్ సహా రాంబాబు గోసల సాహిత్యం అంతే స్టన్నింగ్ గా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం ప్లే బ్యాక్ సింగర్స్ తోనే పాడించిన ఈ పాట ఉత్సాహంగా సాగింది. అలాగే లిరికల్ వీడియోలో విజువల్స్ కూడా బాగున్నాయి.

అంతే కాకుండా పవన్ పై పలు పోరాట సన్నివేశాల దృశ్యాలు కూడా ఈ సాంగ్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి రెండు సింపుల్ సాంగ్స్ తర్వాత మంచి పవర్ తో కూడిన సాంగ్ ని మేకర్స్ ఇపుడు విడుదల చేసారని చెప్పొచ్చు. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read:కాంగ్రెస్ హోంమంత్రిపై ఈడీ దాడులు

- Advertisement -