- Advertisement -
తెలుగు సీనీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీర శంకర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన దర్శకుల సంఘం ఎన్నికల్లో మొత్తం 1113 ఓట్లు పోలయ్యాయన్నారు. తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రెసిడెంట్ గా డైరెక్టర్ వీర శంకర్ 232 ఓట్ల మెజారిటీ తో సముద్ర పై గెలుపొందారు.
వైస్ ప్రెసిడెంట్స్ గా వశిష్ఠ 576 ఓట్లు, సాయి రాజేష్ 355 ఓట్ల తో ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా సుబ్బారెడ్డి (396) 2 ఓట్ల మెజారిటీతో మద్దినేని రమేష్ (394) పై గెలుపొందగా జాయింట్ సెక్రటరీలు గా వడ్డాణం రమేష్ 436, కస్తూరి శ్రీనివాస్ 374 ఓట్లతో ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలు గా ప్రియదర్శి 503, వంశీ కృష్ణ 323 ఓట్లతో గెలవగా ట్రెజరర్ గా పి.వి. రామారావు ఎన్నికయ్యారు.
Also Read:రక్తం తక్కువగా ఉందా..ఇవి తినండి!
- Advertisement -