పర్యావరణ పరిరక్షణే మన ద్యేయం: అరవింద్‌

65
vedham
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు పాల్గోని మొక్కలు నాటి, వాటి ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నారు. వేదం ఫౌండేషన్‌ చైర్మన్‌, టీఆర్ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు అలిశేట్టి అరవింద్‌ పుట్టిన రోజున సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అలిశెట్టి అరవింద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి అని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం కల్పించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌కు కృతజ్ఙతలు తెలిపారు.

- Advertisement -