జహీరాబాద్ డిపోలో ఆర్టీసీ ఎండీ ఆకస్మికంగా తనిఖీ..

32

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ బస్‌స్టాండ్ మరియు డిపోని సందర్శించారు టీఎస్ ఆర్టీసీ డైరెక్టర్ సజ్జనార్.ఈ సందర్భంగా ఆయనకు జహీరాబాద్ డిపో మేనేజర్ మరియు సిబ్బంది శాలువా మరియు బొకే ఇచ్చి సన్మానించారు. అనంతరం జహీరాబాద్ బస్ స్టాండ్ మరియు డిపోలో ఉన్న సమస్యలను డిపో మేనేజర్ రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా సజ్జనార్ బస్టాండ్ లో బస్సుల గురించి వేచి చూస్తున్న ప్రయాణికులతో మాట్లాడి, బస్సులో ప్రయాణిస్తున్న వారిని కూడా మాట్లాడారు, అదేవిధంగా జహీరాబాద్ బస్ స్టాండ్ లో ఉన్న వస్తువుల ట్రాన్స్పోర్ట్ కార్గో కొరియర్ ను కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

డిపోలో కూడ పని చేస్తున్న కార్మిక, సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు, రానున్న రోజులల్లో అన్ని విధాలుగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సహకరించాలని, జహీరాబాద్ బస్ డిపో పరిధిలో ఉన్న వ్యాపార దుకాణలదారులు ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ ధరలో వస్తువులు అమ్మకాలు చేస్తే వాళ్ళ పై కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం మీడియాతో టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ మాట్లాడుతూ, జహీరాబాద్ నుండి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ వెళ్లే బస్సుని అతి త్వరలో ప్రారంభిస్తామని, ప్రయాణికులు బస్సు లో ప్రయాణానికి సహకరించి,బస్సునీ శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అదేవిధంగా ఏమన్నా సమస్యలు ఉంటే అతిత్వరలో మా దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డివిజన్ డిపో మేనేజర్ సురేష్, జహీరాబాద్ డిపో మేనేజర్ రమేష్, మరియు ఆయా శాఖ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.