టీమిండియా మాజీ క్రికెటర్,తమిళనాడు రంజీ ప్లేయర్ వీబీ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని చనిపోయారు. ఆయనకు భార్య,ఇద్దరు కుమార్తెలున్నారు. గురువారం సాయంత్రం గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్ ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానంతో వెళ్లిచూడక ఆయన సీలింగ్ ఫ్యాన్‌కు వెలాడుతుండటం భార్యకు కనిపించింది.
చంద్రశేఖర్ కేవలం క్రికెటర్‌గానే కాకుండా భారత క్రికెట్ జట్టుకు సెలెక్టర్‌గా,ఐపీఎల్‌లో సీఎస్‌కేకు మేనేజర్‌గానూ వ్యవహరించారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో వీబీ కంచి వీరన్స్ అనే జట్టుకు ఆయన యజమాని. దీంతో పాటు చెన్నైలోని వీలంచేరి ప్రాంతంలో వీబీస్ నెస్ట్ పేరుతో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ప్రీమియర్ లీగ్ జట్టులో నష్టాలే ఆయన ఆత్మహత్యకు కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.
1988-90 మధ్య కాలంలో భారత జట్టుకు ఆడారు.ఏడు వన్డేలు ఆడిన ఆయన 88 పరుగులు చేశారు. తమిళనాడు క్రికెట్‌కు సుదీర్ఘ కాలం మూలస్తంభంలా నిలిచిన వీబీ 81 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 4,999 పరుగులు చేశారు.