వసంత పంచమి…సరస్వతీ దేవిని ఎందుకు పూజిస్తారో తెలుసా?

40
- Advertisement -

భారత దేశంలో హిందూ పండగలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘమాసం వచ్చిన ఐదోరోజు వచ్చే శుభదినం వసంత పంచమి. దీనినే శ్రీ పంచమి, సరస్వతి పంచమి అని కూడా పిలుస్తారు. శ్రీ పంచమి రోజున విద్యాభ్యాసం మొదలు పెడితే ఉన్నతవిద్యావంతులవుతారని నమ్మకం. అందుకే తమ పిల్లలకి ఆరోజు అక్షరభ్యాసం చేయిస్తుంటారు తల్లిదండ్రులు. వసంత రుతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో తెలపబడింది.

సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు , కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.

తెలంగాణలో బాసర ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడికి ఎంతో మంది తమ పిల్లను తీసుకు వచ్చి అక్షరాభ్యసం, అన్న ప్రసాసనలు చేయిస్తుంటారు. అంతేకాదు ఈ రోజు ఇళ్లలోనే కాదు పాఠశాలలు, కాలేజీల్లో కూడా సరస్వతి మాత పూజ చేస్తుంటారు.అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.

సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం , పురాణాలు , గ్రంథాలు , కావ్యాలు రచించడం జరిగిందంటారు.

Also Read:ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పోన్ నెంబర్స్!

- Advertisement -