నిహారిక పెళ్లి బారాత్ ఫొటోలు పోస్ట్‌ చేసిన వరుణ్‌..

59
Varuntej

ఇటీవలే మెగా బ్రదర్‌ నాగబాబు గారాపట్టి నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. డిసెంబర్ 9న ఈమె పెళ్లి ఉదయపూర్ కోటలో మాజీ ఐజీ కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో కన్నుల పండగగా జరిగింది. దీనికోసం మెగా ఫ్యామిలీ అంతా కదిలొచ్చింది. చిన్నాపెద్దా అని తేడా లేకుండా మెగా కుటుంబం అంతా వచ్చి నిహారిక పెళ్లిలో డాన్సులు చేసారు.

ఈ క్రమంలో, నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ఈ పెళ్లి బారాత్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘కొత్త బావ కోసం బారాత్’ అంటూ ట్వీట్ చేశారు. ఓ జీపులో చైతన్య ఊరేగింపుగా వస్తుండగా, వరుణ్ తేజ్, సాయితేజ్ తదితరులు ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తుండడం ఆ ఫొటోల్లో చూడొచ్చు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.