వరుణ్…వైజాగ్ షెడ్యూల్ పూర్తి..!

410
varunjtej
- Advertisement -

హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దలకొండ గణేశ్‌తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు వరుణ్ తేజ్‌. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా వైజాగ్‌ షెడ్యూల్‌ని పూర్తిచేసుకున్నారు వరుణ్. ఫిబ్రవరి 24న మొదలైన రెగ్యులర్‌ షూట్‌లో వరుణ్ తేజ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. సుమారు రెండు వారాలు జరిగిన ఈ షెడ్యూల్ ఫిబ్రవరి 10తో ముగిసింది.

ఇక ఈ సినిమా కోసం కొన్ని నెలల పాటు ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు వరుణ్ తేజ్‌. దాదాపు రూ. 35 కోట్ల భారీ బడ్జెట్‌తో అల్లు బాబీ, సిద్దు ముద్దలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా ఈ మూవీతో రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశాడట వరుణ్‌.

- Advertisement -