వేములవాడలో వరుణ యాగం

2
- Advertisement -

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ప్రసిద్ధ వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న ఈ యాగం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ వరుణ యాగంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లకు ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

ఆలయ ప్రాంగణంలో మంత్రులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతున్న వరుణ యాగంలో పాల్గొని ప్రత్యేక హవిస్సులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ తదితర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని స్వామివారి సేవలో తరించారు.

Also Read:శర్వా..’భోగి’ అప్‌డేట్

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, జలాశయాలన్నీ జలకళతో సంతరించుకోవాలని, రైతాంగం సంతోషంగా ఉండాలని కోరుతూ ఈ వరుణ యాగాన్ని వరుసగా మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు. యాగం ముగిసే వరకు ప్రతిరోజూ ప్రత్యేక జపానుష్ఠానాలు, అభిషేకాలు మరియు హోమాలు కొనసాగుతాయి.

- Advertisement -