మెగా హీరో కోసం పాట పాడిన డైరెక్టర్‌ శంకర్‌ కూతురు..

35
- Advertisement -

టాలీవుడ్‌ హీరో వ‌రుణ్ తేజ్ తాజా నటిండిన చిత్రం ‘గని’. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా, ఈ మూవీలో తమిళ డైరెక్టర్‌ కుమార్తె అదితి శంకర్ ఓ పాట పాడింది. ఈ చిత్రంలో రోమియో జూలియట్ అనే రొమాంటిక్ గీతాన్ని అదితితో పాడించారు. ఈ పాటను ఈ నెల 8న విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో తమన్ ఆవిష్కరించనున్నారు. ఇక అదితి శంకర్ తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ‘విరుమాన్’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -