వరుణ్ తేజ్ ‘గని’ విడుదలకు ముహుర్తం ఖరారు..

43
Ghani

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గని’. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగు జరుపుకుంటుంది. ఇప్పటికే చాలావరకూ షూటింగు పూర్తి చేశారు. ఇక ఈ సినిమాను దీపావళికి థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారకంగా తాజాగా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రం బృందం.

బాక్సర్ ‘గని’ పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంతగా కసరత్తు చేశాడనేది ఈ పోస్టర్ ను చూస్తే అర్థమైపోతుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ కథానాయికగా నటిస్తుండగా.. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.