వరుణ్‌…వాల్మీకి రిలీజ్ డేట్ ఫిక్స్‌

431
varun tej valmiki
- Advertisement -

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. తమిళ మూవీ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ ఫిక్సైంది.

సెప్టెంబర్ 6న వాల్మీకి థియేటర్లలో సందడి చేయనున్నాడని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా 14రీల్స్ పతాకంపై రామ్ అటంచ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సరికొత్త లుక్‌లో గ్యాంగ్‌స్టర్‌గా అలరించనున్నాడు వరుణ్ తేజ్‌. తమిళ నటుడు అథర్వ మురళి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ప్రీ-టీజర్‌ను త్వరలోనే విడుదలచేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తామని రంజాన్ రోజున దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతానికైతే విడుదల తేదీని ప్రకటించారు మరి ప్రీ-టీజర్ ఎప్పుడు వదులుతారో వేచిచూడాలి.

- Advertisement -