వరుణ్ తేజ్… ‘ఆపరేషన్ వాలెంటైన్’

60
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఇండియన్స్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఫిల్మ్ కు టైటిల్, విడుదల తేది ఖరారైయింది. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ మూవీ కి’ఆపరేషన్ వాలెంటైన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. డిసెంబర్ 8, 2023న ఈ సినిమా విడుదల కానుంది.

హిందీ, తెలుగులో విడుదలవుతున్న ఈ విజువల్ వండర్ తో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌ పాత్ర పోషిస్తున్నారు. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ కనిపించనుంది. 2022 విడుదలైన ‘మేజర్’ భారీ విజయం తర్వాత, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరో దేశభక్తి కథతో వస్తోంది. ఈ మూవీని హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు.

‘ఆపరేషన్ వాలెంటైన్’ దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్. ఫ్రంట్ లైన్ లో వున్న వైమానిక దళ వీరుల అలుపెరగని స్ఫూర్తిని, మునుపెన్నడూ చూడని పోరాటాన్ని, వైమానిక దాడులలో వారు ఎదుర్కొన్న సవాళ్లను చూపనుంది.

Also Read:మోడీకి పోటీగా ప్రియాంక గాంధీ?

ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ , VFX నిపుణుడైన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రం డిసెంబర్ 8, 2023న తెలుగు, హిందీలో విడుదల కానుంది.

- Advertisement -