వరుణ్ తేజ్ స్పేస్ ఫిల్మ్..15న టైటిల్ రిలీజ్‌..

219
Mega Prince Varun Tej
- Advertisement -

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా “ఘాజీ” ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ అడ్వెంచరస్ ఫిలిం తెరకెక్కుతోంది. నేడు ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం టైటిల్‌ను ఎనౌన్స్ చేయడం తోపాటు.. విడుదల తేదీని ఆగస్టు 15వ తారీఖు ఉదయం 9.30కి ప్రకటించనున్నారు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక విలువలతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో జీరో గ్రావిటీ టెక్నాలజీతో వేయబడిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరిగింది.

Mega Prince Varun Tej,

వరుణ్ తేజ్ & టీమ్ అందరూ జీరో గ్రావిటీలో ట్రయినింగ్ కూడా తీసుకొన్నారు. అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఇంకా టైటిల్ నిర్ణయించబడని ఈ చిత్రాన్ని సాయిబాబు జాగర్లమూడి-రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తుండగా.. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: వరుణ్ తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తడితరులు… సాంకేతిక బృందం: దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి ,సమర్పణ: క్రిష్ జాగర్లమూడి, నిర్మాతలు: క్రిష్ జాగర్లమూడి-సాయిబాబు జాగర్లమూడి-రాజీవ్ రెడ్డి, నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: ప్రశాంత్ విహారీ, ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ-మౌనిక, యాక్షన్ కొరియోగ్రఫీ: టోడోర్ పెట్రోవ్ లజారోవ్, సి.జి: రాజీవ్ రాజశేఖరన్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్.

- Advertisement -