‘గద్దలకొండ గణేశ్’ విజయాన్ని అందించడంతో వరుణ్ తేజ్ ఫుల్ జోష్‌తో వున్నాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఓ మూవీలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఇక ‘వాల్మీకి’ (గద్దలకొండ గణేష్) సినిమా హిట్ అవ్వడంతో వరుణ్ మార్కెట్ బాగా పెరిగింది. దీంతో ఈ మెగా హీరో పారితోషకం భారీగా పెంచేశాడట.
ఇదివరకు 3 నుండి 4 కోట్లు ఉన్న అతని రెమ్యునరేషన్ ఒక్కసారిగా డబుల్ చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ‘తొలిప్రేమ – ఎఫ్ 2 – వాల్మీకి’ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వడంతో వరుణ్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. దాంతో వరుణ్ తన రెమ్యునరేషన్ ని 7 నుండి 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు.
గత కొన్ని సంవత్సరాల నుండి వరుణ్ నుండి వస్తున్న సినిమాలు ‘అంతరిక్షం’ మినహాయించి అన్ని సినిమాలు నిర్మాతలకు లాభాలు తీసుకు రావడంతో నిర్మాతలు రెమ్యునరేషన్ ఎక్కువైనా వరుణ్ తో సినిమాలు చేయడానికి సిద్దపడుతున్నారు.