విశాల్ కు విల‌న్ గా జగ్గుభాయ్..

262
jagapathi babu vishal
- Advertisement -

బాల‌కృష్ణ లెజెండ్ సినిమాతో విల‌న్ గా ఎంట్రీ ఇచ్చాడు జ‌గ‌ప‌తిబాబు. ఆయ‌న‌కు హీరోగా అవ‌కాశాలు రావ‌పోవ‌డంతో విల‌న్ పాత్ర‌లో మెప్పిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగు, త‌మిళ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. త‌న‌దైన యాక్టింగ్, ప‌వ‌ర్ పుల్ విల‌నిజంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఇటివ‌లే ఆయ‌న న‌టించిన రంగ‌స్ధ‌లం, అర‌వింద స‌మేత సినిమాల్లో ఆయ‌న‌లోని మ‌రో కోణాన్ని చూపించారు.

Jagapathi Babu Aravindha Sametha

ఈ మధ్య తమిళ్‌లో  అజిత్ ‘విశ్వాసం’ సినిమాలో విలన్‌గా నటించాడు. తాజాగా కోలీవుడ్ లో మ‌రో సినిమా చేయ‌డానికి సిద్ద‌మ‌య్యాడు జ‌గ‌ప‌తిబాబు. విశాల్ మూవీలో జగ్గుభాయ్ విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు. ఈచిత్రానికి సుంద‌ర్ .సి ద‌ర్వ‌కత్వం వ‌హించ‌నున్నారు.

jagapathibabui

ఇంత‌కుముందు విశాల్ న‌టించిన క‌త్తిసండై సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా న‌టించారు. మరోసారి వీరిద్దరి క‌లిసి న‌టిస్తుండ‌టంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్ష‌కులు. ద‌ర్శ‌కుడు సుంద‌ర్.సి ప్ర‌స్తుతం హీరో శింబుతో అత్తారింటికి దారేది సినిమా రీమేక్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈచిత్రం విడుద‌ల కానుంది.

- Advertisement -