రవితేజ..ఖిలాడి న్యూఇయర్ ట్రీట్..

33
ravi

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఖిలాడి. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన‘ఇష్టం’ అనే మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక న్యూఇయర్ సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు రవితేజ. సినిమా నుండి ఐటం సాంగ్‌ డిసెంబర్ 31న ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నారు.

వాస్తవానికి ఈ ఏడాది మే 28న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో జాప్యం జరిగింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌ అయింది. వచ్చే ఏడాది 2022, ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫిషియల్‌గా వెల్లడించింది.

ఇందులో రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సాతో పాటు దేవిశ్రీ తమ్ముడు సాగర్ మాటలు రాస్తున్నాడు.