టాలీవుడ్‌లో హీరోయిన్ శ్రీరెడ్డి ఒక సంచలనం మారింది. ఎవరూ నోరు విప్పేందుకు ఇష్టపడని క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా మాట్లాడేయటమే కాదు.. అవకాశాల కోసం తాను అందరి చేతిలో మోసపోయిన విషయాన్ని చెప్పేసింది. మోసపోయిన అమ్మాయిని చూసిన వారు జాలి పడటం.. అయ్యో అనటం మామూలే. దీనికి తగ్గట్లే శ్రీరెడ్డి ఉదంతంలోనూ.. మొదట్లో ఆమెకు ఈ తరహాలోనే మద్దతు లభించింది.
ఆమె లాగా టీవీల ముందుకు రాకున్నా.. ఓపెన్ గా మాట్లాడలేని వారు పలువురు శ్రీరెడ్డికి తెర వెనుక మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతున్న శ్రీరెడ్డిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. తానేం అన్నా.. తనకు ఎదురు చెప్పే ధైర్యం చేయలేరన్న భావన వచ్చినట్లుగా కనిపిస్తోంది.
తాజాగా శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖలు చేసింది… ‘‘పవన్ కల్యాణ్.. నువ్వు ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నావ్ అసలు అమ్మాయి జాతి మీద విలువుందా?. నువ్వు ప్రజా నాయకుడివి అయ్యుండి ఏం మాట్లాడుతున్నావ్. పోలీస్ స్టేషన్లకు వెళ్లాలి ఇదేనా నువ్ నాకిచ్చే సలహా. ‘పవన్ కల్యాణ్ అన్నా’ అన్నాం కదా అందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకుంటున్నాను. పవన్‌ను ఎవరూ.. ఏ అమ్మాయి కూడా అన్నా అని పిలవదు. అన్నా అన్నందుకు ఒక అమ్మాయిగా నన్ను నేను అవమానించుకున్నాను అంటు పవన్ కల్యాణ్‌పై అసభ్యంగా మాట్లాడింది. అంతేకాదు ఆయన తల్లిని అవమానిస్తూ అసభ్యంగా మాట్లాడింది.
ఈ వ్యాఖ్యలపై వరుణ్ స్పందించాడు. ‘‘నీ గురించి విమర్శంచి.. నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అటువంటి వాళ్లు వాళ్ల బలహీనతలను తెలుసుకోలేరు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తారు’’ అని వరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై హీరో నితిన్ కూడా స్పందించాడు. ‘‘ప్రతి ఒక్క చర్యకూ.. ప్రతి చర్య ఉంటుంది. దాని కోసం వెయిట్ చెయ్.. రియాక్షన్ వస్తోంది’’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. నితిన్ స్పందించడం పట్ల థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇక పవన్ అభిమానుల సంగతైతే చెప్పనక్కర్లేదు.. అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.