పెళ్లి డేట్ పై వరుణ్ తేజ్ క్లారిటీ

35
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వాయిదా పడిందన్న ప్రచారం నేపథ్యంలో మ్యారేజ్ డేట్ పై వరుణ్ స్పందించారు. ‘పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. త్వరలోనే డేట్ ఫిక్స్ అవుతుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుంది. పెళ్లి డేట్స్ మా అమ్మ చూస్తున్నారు. ఆమె చెప్పగానే పెళ్లి తేదీపై ప్రకటన చేస్తా’ అని గాండీవధారి అర్జున మూవీ ప్రమోషన్ల వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.

అలాగే మెగా ప్రిన్స్ తనకు కాబోయే సతీమణి.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏం ఇష్టమో తనకు బాగా తెలుసు. మా అభిరుచులు కలవడంతో రిలేషన్‌లోకి వచ్చాం. నేనే మొదట ప్రపోజ్ చేశా. నిశ్చితార్థం మాదిరిగానే పెళ్లి కూడా సింపుల్‌గా ఉంటుంది అని వరుణ్ తేజ్ తన మనసులో మాటను బయటపెట్టాడు.

హైదరాబాద్ లో నాగబాబు ఇంటి వద్దనే అంగరంగ వైభవంగా వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబ పెద్దలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఉంగరాలు మార్చుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్ – అంతరిక్షం అనే రెండు సినిమాల్లో కూడా కలిసి నటించారు. ముఖ్యంగా మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలోనే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమే పెళ్లి వరకూ దారి తీసింది.

Also Read:KTR:విపక్షాలకు సినిమా చూపిస్తాం

- Advertisement -