‘అంతరిక్షం 9000 KMPH ‘ ట్రైలర్ లాంచ్ ..!!

259
Antariksham
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి , అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 KMPH’..డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా సినిమా విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకుడు.. దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. .. కాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైద్రాబాద్ లో AMB సినిమాస్ లో ఘనంగా జరిగింది..కాగా ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు..

డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రయత్నం చేయడం నిజంగా అద్భుతం.. ఘాజీ లాంటి సినిమా తర్వాత సంకల్ప్ ఎలాంటి సినిమా చేస్తాడు అనుకున్నాను కానీ అంతరిక్షంపై సినిమా చేయడం గొప్ప విషయం.. 1500 సీజీ షాట్స్ ఉన్న సినిమా ను ఇంత త్వరగా రిలీజ్ చేయడం గ్రేట్.. మేమంతా నిన్ను ఫాలో అవ్వాలి..సంకల్ప్ లా ఉంటే ఎంత పెద్ద సినిమా అయినా చేయొచ్చు..ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు..

డైరెక్టర్ సంకల్ప్ మాట్లాడుతూ.. డిసెంబర్ 21 న సినిమా రాబోతుంది..అందరూ డేట్ మార్క్ చేసుకోండి.. ఇలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది.. సినిమాలో 1500 సీజీ షాట్స్ ఉన్నాయి.. అందరూ ముంబాయ్ లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు..సినిమా చూసి అందరూ అమేజింగ్ గా ఫీల్ అవుతారు.. ఘాజీ కన్నా ఎక్కువ ప్రెజర్ ఈ సినిమాలో ఉంది.. సినిమా బాగా వచ్చేలా ప్రయత్నం చేశాం..అందరూ తప్పకుండా ఆదరించాలని అన్నారు..

నిర్మాత క్రిష్ మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన సుకుమార్ గారికి, అల్లు అరవింద్ గారికి చాలా థాంక్స్.. ఈ కథను నమ్మి సినిమా చేసిన హీరో వరుణ్ కి వెరీ థాంక్స్.. ఈ సినిమ హిట్ తాలూకు క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది.. ఈ సినిమాలో నాపేరు ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.. ఈ సినిమా కి వర్క్ చేసిన అందరి వర్క్ చూసిన తర్వాత మంచి అనుభూతి కలిగింది.. ఇలాంటి వెరైటీ కథలు ఒప్పుకుని వరుణ్ ఇంకా మంచి సినిమాలు చేయాలన్నారు..

హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి చాలా థాంక్స్.. సినిమా ట్రైలర్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను.. రిలీజ్ తర్వాత సినిమా గురించి మాట్లాడుతాను.. అందరం చాలా కష్టపడి ఒక డిఫరెంట్ సినిమా చేశాం.. ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది.. అన్నారు..

- Advertisement -